నా గురించి
సెప్టెంబరు 13, 2006
నా పేరు బికారి నా దారి ఎడారి
తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను
విసుగు రాదు ఖుషీ పోదు
వేసట లేనే లేదు
అసలు నా మరో పేరు ఆనంద విహారి!
నా పేరు ||
మనసున్న చోట మజిలి కాదన్న చాలు బదిలీ
నా పేరు ||
కూటికి నే పేదను గుణములలో పెద్దను
సాహసమే నాకు బలం సంకల్పం నాకు ధనం
ఏ నాటికొ ఈ గరీబు కాకపోడు నవబు
అంతవరకు నేనొక నిరంతర సంచారి
నా పేరు ||
మే 30, 2007 at 6:27 అపరాహ్నం
ఒకసారి మిమ్మల్ని శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్బులో చూసినట్టున్నా
మంచి పాట గుర్తుచేశారు. ధన్యవాదాలు.