నానిలు

నవంబరు 29, 2006

నానీలు గోపీ గారు రూపొందించిన ఒక కవితా ప్రక్రియ.
నానీలు అంటే నావీ నీవీ వెరసి మనవి అని అర్థం.
మచ్చుకు కొన్ని గోపి గారి నానీలు.

ఎండ పొడల్లొ
తడిగా నానిలు
రక్తంతో శ్రుతి చేసిన
వినూత్న బాణీలు

మూడేళ్లయినా
కలవని దూరం
మూడు గంటల ప్రయాణంలో
అనుబంధమైంది

గాయానికి
నమస్కరించాను.
గేయాన్ని
ప్రసాదించినందుకు.

ఇండియా
ప్రతి రోజూ
కన్యాకుమారిలో
కాళ్లు కడుక్కుంటుంది

చెరువు కట్ట మీద
చెట్టంత బాల్యం
నీడలు
ఇప్పటికీ ఉన్నాయి

క్రిందివి నా ప్రయోగాలు.

నీటితో వ్యాపారం
నేలతో వ్యాపారం
ఇక అమ్మే
మిగిలింది

చిన్నప్పుడు బడి
తరువాత ఉద్యోగం
మరి
జీవితమో?

అందరూ
ఇంగ్లిష్ మీడియమే
అన్నం కంటె
ఐస్ క్రీమే రుచి

ఎంత
ఒంటరితనమో
కవితలు
వ్రాసి ఎన్నో రోజులయింది

ఎంత
కాలుష్యమో
మనుషుల్లోనూ
మాటల్లోనూ కూడా

అది ఒకానొక మలి సందె
ఎదుట గౌతమీ నది
ఇరు దరులొరసి
మింటి చాయలను నెమరు వేసి కొనుచు సాగినది…

అపుడు
అప్పుడే కలిగె నా కొక్క దివ్యనుభూతి
కలిగె నా కొక్క దివ్యనుభూతి
శూన్యాకాశము వలె
చైతన్య లవము లేని బ్రతుకు దారుల
చంపాలత కన్యక తొలి వలపు వోలె
కాంతులు నించెన్

అంతరాంతరమున వింత కాంతి నిండె
ఊహలకు రెక్కలొచ్చె
ప్రతూష పవన లాలనమునకు విచ్చు
సుమాల వోలె
అనతి కవితలు వెలువడె!

ఇవి మేఘ సందేశం సినిమా లోని కొన్ని కృష్ణశాస్త్రి కవితలు….
తప్పులుంటే సరి దిద్ద గలరు.

Hello world!

సెప్టెంబరు 13, 2006

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!